Published on Nov 7, 2024
Government Jobs
నిజామాబాద్‌ జిల్లాలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులు
నిజామాబాద్‌ జిల్లాలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులు

నిజామాబాద్‌లోని మెడికల్ అండ్‌ హెల్త్ డిపార్ట్‌మెంట్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన నిజామాబాద్‌ జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 13

వివరాలు:

అర్హత: ఎంబీబీఎస్‌/ బీఏఎంఎస్‌/ బీఎస్సీ(నర్సింగ్)/ జీఎన్‌ఎం ఉత్తీర్ణత.

వయోపరిమితి: 18 నుంచి 46 సంవత్సరాల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు ఎంబీబీఎస్‌/ బీఏఎంఎస్‌ వైద్యులకు రూ.40,000. స్టాఫ్ నర్సులకు రూ.29,900.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, ఐడీఓసీ కాంప్లెక్స్‌, నిజామాబాద్‌ చిరునామాకు పంపాలి.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 09/11/2024.

Website:https://nizamabad.telangana.gov.in/