- స్థూల జాతీయాదాయం పెరుగుతున్నప్పటికీ చాలా దేశాల్లో ఆర్థిక అసమానతలు మాత్రం ఆశించిన స్థాయిలో తగ్గడం లేదని నేచర్ సస్టెయినబిలిటీ అనే జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు సగం జనాభా.. ఆదాయ అసమానతలు పెరిగిన దేశాల్లోనే ఉందని పేర్కొంది. 1990తో పోలిస్తే మాత్రం అంతర్జాతీయ జనాభాలో 94 శాతం మంది స్థూల జాతీయాదాయం పెరిగిందని తెలిపింది.
- దేశాల్లో, దేశాల మధ్య అసమానతలను తగ్గించడం ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో (ఎస్‌డీజీ) పదోది. దాన్ని సాధించడంలో ప్రపంచ పురోగతిని గుర్తించేందుకు ఫిన్లాండ్‌లోని ఆల్టో విశ్వవిద్యాలయం సహా పలు ఇతర సంస్థలకు చెందిన పరిశోధకులు భారత్, బ్రెజిల్, చైనా తదితర దేశాల్లో ఉమ్మడిగా తాజా అధ్యయనాన్ని నిర్వహించారు.