Published on Dec 23, 2025
Current Affairs
నౌకా దళంలోకి ‘అంజదీప్‌’
నౌకా దళంలోకి ‘అంజదీప్‌’
  • తక్కువ లోతు జలాల్లో సంచరించే జలాంతర్గాముల విధ్వంసక నౌక ‘అంజదీప్‌’ 2025, డిసెంబరు 22న నౌకాదళంలో చేరింది. కోల్‌కతాకు చెందిన గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ (జీఆర్‌ఎస్‌ఈ) సంస్థ తయారు చేసిన ఈ నౌకను లాంఛనంగా చెన్నైలో నౌకాదళానికి అందజేశారు. నౌకాదళంలో చేరిన ఈ కోవకు చెందిన నౌకల శ్రేణిలో ఇది మూడోది.
  • వాటర్‌ జెట్స్‌ సాయంతో ముందుకు నడిచే ఈ నౌకలో అధునాతన తేలికపాటి టార్పిడోలు, దేశీయంగా రూపొందించిన సబ్‌మెరీన్‌ రాకెట్లు, షాలో వాటర్‌ సోనార్లు అమర్చి ఉన్నాయి.