Published on Nov 12, 2025
Current Affairs
నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు
నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఇప్పటి వరకు (నవంబరు 10) నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 7% పెరిగి రూ.12.92 లక్షల కోట్లకు చేరాయి. 2024-25 ఇదే సమయానికి ఈ వసూళ్లు రూ.12.08 లక్షల కోట్లుగా ఉన్నాయి. 

2025 ఏప్రిల్‌ 1 నుంచి నవంబరు 10 మధ్య రిఫండ్‌ల జారీ 18% తగ్గి రూ.2.42 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. నికర కార్పొరేట్‌ పన్ను వసూళ్లు ఏడాది క్రితం (2024) రూ.5.08 లక్షల కోట్లు కాగా, ఇప్పుడు రూ.5.37 లక్షల కోట్లకు పెరిగాయి. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాల (హెచ్‌యూఎఫ్‌ల)తో కూడిన నాన్‌ కార్పొరేట్‌ పన్ను వసూళ్లు రూ.6.62 లక్షల కోట్ల నుంచి రూ.7.19 లక్షల కోట్లకు చేరాయి.