రూ.44,700 కోట్లకు పైగా వ్యయంతో రెండు ప్రధాన నౌకా నిర్మాణ పథకాలకు మార్గదర్శకాలను కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. దేశీయ నౌకానిర్మాణ సామర్థ్యాలను బలోపేతం చేయడం, అంతర్జాతీయ స్థాయిలో పోటీతత్వాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా షిప్‌బిల్డింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్ (ఎస్‌బీఎఫ్‌ఏఎస్), షిప్‌బిల్డింగ్ డెవలప్‌మెంట్ స్కీమ్ (ఎస్‌బీడీఎస్)లను ప్రభుత్వం తీసుకొచ్చింది.