Published on Feb 28, 2025
Current Affairs
ది వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ జాబితా
ది వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ జాబితా

ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన 24 మంది సూపర్‌ బిలియనీర్ల జాబితాను ‘ది వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’ విడుదల చేసింది.

సంపద నికర విలువ కనీసం 50 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.4.35 లక్షల కోట్లు) ఉన్న వారిని సూపర్‌ బిలియనీరుగా సంస్థ పరిగణించింది.

ఈ 24 మందిలో 16 మంది సెంటి బిలియనీర్ల (100 బిలియన్‌ డాలర్లు/రూ.8.7 లక్షల కోట్ల)ని నివేదిక తెలిపింది.

వీరందరి సంపద విలువ కలిపితే 3.3 లక్షల కోట్ల డాలర్లని, ఫ్రాన్స్‌ జీడీపీకి ఇది సమానమని పేర్కొంది. 

ఇందులో మనదేశం నుంచి ముకేశ్‌ అంబానీ (90.6 బి.డాలర్లు), గౌతమ్‌ అదానీ (60.6 బి.డాలర్లు)కి చోటు దక్కింది.