Published on Jan 17, 2026
Current Affairs
‘ద లాన్సెట్‌ డయాబెటిస్‌ అండ్‌ ఎండోక్రైనాలజీ’
‘ద లాన్సెట్‌ డయాబెటిస్‌ అండ్‌ ఎండోక్రైనాలజీ’

2024లో భారత్‌లో 9 కోట్ల మంది వయోజనులు మధుమేహంతో జీవించారని ఒక అధ్యయనం తేల్చింది. తద్వారా ఈ రుగ్మత బాధితులు ఎక్కువగా ఉంటున్న దేశాల్లో రెండో స్థానంలో ఉందని పేర్కొంది. 14.8 కోట్ల మందితో చైనా మొదటిస్థానంలో, 3.9 కోట్ల మందితో అమెరికా మూడోస్థానంలో ఉన్నాయని వివరించింది. ఈ అధ్యయనం వివరాలు ‘ద లాన్సెట్‌ డయాబెటిస్‌ అండ్‌ ఎండోక్రైనాలజీ’ పత్రికలో ప్రచురితమయ్యాయి. అధిక జనాభా కలిగిన చైనా, భారత్, అమెరికా, పాకిస్థాన్‌ వంటి దేశాలు మధుమేహుల వాటాను ఎక్కువగా కలిగి ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. 

ఈ విషయంలో 2050 నాటికి పాకిస్థాన్‌.. అమెరికాను దాటేయవచ్చని చెప్పారు. 215 దేశాలకు సంబంధించి 2005 నుంచి 2024 మధ్య జరిగిన 246 అధ్యయనాలను విశ్లేషించి, 2050 నాటి పరిస్థితిపై అంచనాలు వేశారు.