Published on Dec 11, 2025
Current Affairs
ది లాన్సెట్‌’ జర్నల్‌
ది లాన్సెట్‌’ జర్నల్‌

2023 నాటికి- బాల్యంలో లైంగిక వేధింపులను ఎదుర్కొన్నవారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 101 కోట్లుగా ఉందని ఒక అధ్యయనం తెలిపింది. సన్నిహిత భాగస్వామి చేతుల్లో హింస (ఐపీవీ)కు గురైన మహిళల సంఖ్య 60.8 కోట్లుగా నమోదైనట్లు వెల్లడించింది. 2023 నాటికి 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసుకు చేరుకున్నవారి పరిస్థితినే ఈ అధ్యయనంలో విశ్లేషించినట్లు పేర్కొంది. ‘ది లాన్సెట్‌’ జర్నల్‌లో సంబంధిత వివరాలు ప్రచురితమయ్యాయి. వాటి ప్రకారం- లైంగిక వేధింపులు, ఐపీవీకి సంబంధించిన ఘటనలు సబ్‌ సహారన్‌ ఆఫ్రికా, దక్షిణాసియాల్లో ఎక్కువగా నమోదయ్యాయి. భారత్‌లో మహిళల్లో 30% మంది, పురుషుల్లో 13% మంది బాల్యంలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారు. మహిళల్లో 23% మంది సన్నిహిత భాగస్వామి చేతుల్లో హింసకు గురయ్యారు.