- గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ (మోస్పి) విడుదల చేసిన తొలి ముందస్తు అంచనాల ప్రకారం 2025-26లో వృద్ధిరేటు 7.4 శాతంగా నమోదు కానుంది. ఆర్‌బీఐ అంచనా వేసిన 7.3% కంటే, ప్రభుత్వ ప్రాథమిక అంచనా అయిన 6.3-6.8% కంటే మెరుగ్గా 7.4 శాతంగా నమోదు కానున్నట్లు పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత వేగవంత ఆర్థిక వ్యవస్థగా మనదేశం కొనసాగనన్నట్లు మోస్పి వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో వృద్ధిరేటు 6.5 శాతంగా నమోదైంది.
- 2025-26లో వాస్తవ లేదా స్థిర ధరల వద్ద జీడీపీ రూ.201.90 లక్షల కోట్లకు చేరుతుందని మోస్పి అంచనా వేసింది.