స్వీయ సాంకేతికతతో తయారు చేసిన నీలగిరి శ్రేణి నౌకలైన ఐఎన్‌ఎస్ హిమగిరి, ఐఎన్‌ఎస్ ఉదయగిరిలను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ 2025, ఆగస్టు 26న జాతికి అంకితం చేశారు.
తూర్పు నౌకాదళ ముఖ్య కేంద్రమైన విశాఖపట్నంలోని డాక్‌యార్డులో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఇండో-పసిఫిక్, చైనా ప్రాంత సరిహద్దుల్లో చేపడుతున్న వ్యూహాత్మక రక్షణ ప్రాజెక్టు పనుల్లో భాగంగా పీ-17 పేరిట స్వీయ సాంకేతికత, ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలతో కోల్‌కతా, ముంబయిలలో ఈ యుద్ధ నౌకలను భారత రక్షణ వ్యవస్థ నిర్మించింది.