Published on Oct 27, 2025
Current Affairs
దేశవ్యాప్తంగా విద్యార్థుల్లేని పాఠశాలలు 8,000
దేశవ్యాప్తంగా విద్యార్థుల్లేని పాఠశాలలు 8,000

దేశవ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరంలో దాదాపు 8వేల పాఠశాలల్లో ఒక్క విద్యార్థీ చేరలేదు. ఈ తరహా పాఠశాలలున్న రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో పశ్చిమ బెంగాల్, తర్వాతి స్థానాల్లో తెలంగాణ, మధ్యప్రదేశ్‌ ఉన్నాయని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ఒక్క విద్యార్థీ చేరని ఈ పాఠశాలల్లో 20,187 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు.

పశ్చిమ బెంగాల్‌లో విద్యార్థులు చేరని స్కూళ్లు 3,812 ఉండగా.. వాటిలో 17,965 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. తెలంగాణలో 2,245 విద్యాలయాల్లో 1,016 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు.