2025, మే 1 నుంచి దేశవ్యాప్తంగా 700 జిల్లాల వ్యాప్తంగా 22,000కు పైగా శాఖలతో 28 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు(ఆర్‌ఆర్‌బీ) కార్యకలాపాలు నిర్వహిస్తాయని ఆర్థిక శాఖ తెలిపింది. ‘ఒక రాష్ట్రం ఒక ఆర్‌ఆర్‌బీ’ విధానం అమల్లోకి రావడమే ఇందుకు కారణం. ఈ విధానం కింద ఒక రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్కటే ఆర్‌ఆర్‌బీ ఉండేలా.. 11 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 26 ఆర్‌ఆర్‌బీలను ఏకీకరణ చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఆర్‌ఆర్‌బీల సంఖ్య 28కు తగ్గింది.