Published on Jan 23, 2025
Current Affairs
దేశంలో 99.1 కోట్ల మంది ఓటర్లు
దేశంలో 99.1 కోట్ల మంది ఓటర్లు

ఎన్నికల సంఘం 2025, జనవరి 22న విడుదల చసిన ఓటర్ల వివరాల ప్రకారం, దేశంలో ఓటర్ల సంఖ్య 99.1 కోట్లకు చేరింది.

ఇది త్వరలోనే 100 కోట్లకు చేరుకోనుంది. దీంతో బిలియన్‌ ఓటర్లున్న దేశంగా భారత్‌ రికార్డు సృష్టించనుంది.

2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా 96.88 కోట్ల మంది ఓటర్లుగా నమోదయ్యారు.

మొత్తం ఓటర్లలో 21.7 కోట్ల మంది 18-29 ఏళ్ల మధ్య వయసున్న యువత ఉన్నారు.