దేశ వ్యాప్తంగా నదుల్లో నీటి మట్టం, ప్రవాహ స్థాయుల్ని లెక్కించేందుకు ఏర్పాటు చేసిన కేంద్రాల్లో 25 ప్రాంతాల్లో తీవ్ర వరద పరిస్థితులు నమోదయ్యాయని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) వెల్లడించింది. ఈ కేంద్రాల్లో 12 ఉత్తర్‌ప్రదేశ్‌లో, 10 బిహార్‌లో, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, రాజస్థాన్‌లలో చెరొకటి ఉన్నాయి