దేశంలో ప్రతి 811 మంది ప్రజలకు ఒక అర్హత కలిగిన వైద్యుడు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం 2025, డిసెంబరు 2న పార్లమెంటుకు తెలిపింది. అల్లోపతి పద్ధతిలో చికిత్స చేసే వైద్యులు దేశంలో 13,88,185 మంది ఉండగా, ఆయుష్ వైద్య విధానంలో రిజిస్టర్ అయినవారు 7,51,768 మంది ఉన్నారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో చెప్పారు. రిజిస్టర్ అయిన అల్లోపతి, ఆయుష్ వైద్యుల్లో 80 శాతం మంది అందుబాటులో ఉన్నారని భావించినా దేశంలో డాక్టర్లు 1 : 811 నిష్పత్తిలో ఉన్నారు.