పశ్చిమాసియా యుద్ధ కారణంగా దేశంలో గ్యాస్ కొరత భయాలు నెలకొన్న నేపథ్యంలో హరియాణాలోని గురుగ్రామ్‌లో ఉన్న ‘ఎల్పీజీ ఏటీఎం’ ప్రత్యేకంగా వార్తల్లో నిలిచింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ఈ ఏఐ ఆధారిత గ్యాస్ సిలిండర్ స్మార్ట్ వెండింగ్ మిషన్‌ను 2025లో ఏర్పాటు చేసింది. ఇది ఏటీఎం మాదిరిగా పనిచేస్తుంది. 2-3 నిమిషాల్లోనే సిలిండరు తీసుకోవచ్చు.
సాధారణ లోహపు సిలిండర్లు అందులోని గ్యాస్‌తో కలిపి మొత్తం 31 కిలోల బరువు ఉంటాయి. ఈ ఏటీఎంలలో లభ్యమయ్యే ఫైబర్ సిలిండర్లు గ్యాస్‌తో కలిపి 15 కిలోల బరువు ఉంటాయి. భారత్ గ్యాస్ కాంపోజిట్ సిలిండర్ కనెక్షన్ ఉన్న వినియోగదారులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.