Published on Nov 12, 2024
Current Affairs
దేశంలో తొలిసారిగా అంతరిక్ష యుద్ధవిన్యాసాలు
దేశంలో తొలిసారిగా అంతరిక్ష యుద్ధవిన్యాసాలు

అంతరిక్షంలో తన వ్యూహాత్మక ప్రయోజనాలను రక్షించుకునే ఉద్దేశంతో భారత్‌ తొలిసారిగా ‘అంతరిక్ష అభ్యాస్‌’ పేరిట విన్యాసాలు నిర్వహిస్తోంది. 2024, నవంబరు 11న దిల్లీలో ఈ కార్యక్రమం ప్రారంభమైనట్లు త్రిదళాధిపతి జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ తెలిపారు.

రోదసిలోని మన సాధన సంపత్తికి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నవంబరు 13 వరకూ ఇవి జరుగుతాయి. రక్షణ అంతరిక్ష సంస్థ (డీఎస్‌ఏ) వీటిని నిర్వహిస్తుంది.