- ప్రస్తుతం మన దేశంలో ముడిచమురు, రిఫైన్డ్ పెట్రోలియం ఉత్పత్తుల రూపంలో 250 మిలియన్ బ్యారెళ్ల (దాదాపు 4000 కోట్ల లీటర్లు) ఇంధన నిల్వలున్నాయని ప్రభుత్వం 2026, మార్చి 8న వెల్లడించింది. మంగళూరు, పడూర్, విశాఖపట్నం ప్రాంతాల్లోని వ్యూహాత్మక కేంద్రాలతో పాటు ట్యాంకులు, పైప్‌లైన్లు, సముద్ర నౌకల్లో ఈ నిల్వలున్నాయని చెప్పింది.
- దశాబ్దం క్రితం 27 దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటుండగా, ప్రస్తుతం 40 దేశాల నుంచి మనకు చేరుతోంది. మన దేశ చమురు దిగుమతుల్లో 40 శాతమే హర్మూజ్ జలసంధి మీదుగా వస్తోందని, మిగతా 60% రష్యా, పశ్చిమ ఆఫ్రికా, అమెరికా, మధ్య ఆసియా మార్గాల ద్వారా అందుతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.