Published on Sep 17, 2024
Current Affairs
దేశంలోనే వ్యవసాయ రంగంలో మొదటి ఇంక్యుబేటర్‌
దేశంలోనే వ్యవసాయ రంగంలో మొదటి ఇంక్యుబేటర్‌

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో ఉన్న ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని అగ్రిహబ్‌ ఆవిష్కరణల కేంద్రం (ఇన్నోవేషన్‌ సెంటర్‌) దేశంలో వ్యవసాయ రంగంలో మొదటి ఇంక్యుబేటర్‌గా గుర్తింపు పొందింది. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఆవిష్కరణలు, బ్లాక్‌చైన్, రోబోటిక్, క్లౌడ్, డ్రోన్‌ల వంటి అధునాతన సాంకేతికతలతో రైతుల సమస్యలకు పరిష్కారాలు చూపే ఆలోచనలను ప్రోత్సహిస్తోంది.

* 2021లో ప్రభుత్వం 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అగ్రిహబ్‌ను ఏర్పాటు చేసింది. దీనికి నాబార్డు రూ.9 కోట్ల సాయం అందించింది. వరంగల్, జగిత్యాల, వికారాబాద్‌లలో ప్రాంతీయ కేంద్రాలున్నాయి.