Published on Jul 4, 2025
Current Affairs
దేశంలోనే తొలి సోలార్‌ బస్‌స్టేషన్‌
దేశంలోనే తొలి సోలార్‌ బస్‌స్టేషన్‌

దేశంలోనే మొదటిసారిగా సోలార్‌ బస్‌స్టేషన్‌ గుజరాత్‌లోని సూరత్‌లో ఏర్పాటైంది. ఇందులో రూఫ్‌టాప్‌ సోలార్‌ పవర్‌ ప్లాంట్, సెకండ్‌ లైఫ్‌ బ్యాటరీ స్టోరేజ్‌ సిస్టమ్‌ ద్వారా బస్సులకు 24 గంటల గ్రీన్‌ ఛార్జింగ్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. సూరత్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ రూ.1.60 కోట్ల వ్యయంతో ఆల్తాన్‌లో కొత్తగా ఈ ‘స్మార్ట్‌ బస్‌ స్టేషన్‌’ను నిర్మించింది. ఈ ప్రాజెక్టును జర్మన్‌ సంస్థ సహకారం అందించింది.