Published on Nov 19, 2024
Current Affairs
దేశంలోనే తొలి మిథనాల్‌ తయారీ ప్లాంట్‌!
దేశంలోనే తొలి మిథనాల్‌ తయారీ ప్లాంట్‌!

దేశంలోనే తొలిసారి సింగరేణి సంస్థకు చెందిన థర్మల్‌ విద్యుత్కేంద్రం ద్వారా గాలిలోకి వెలువడే కార్బన్‌ డయాక్సైడ్‌ నుంచి మిథనాల్‌ తయారీ ప్లాంట్‌ను ప్రయోగాత్మకంగా నిర్మిస్తోంది.

రోజుకు 500 కేజీల కార్బన్‌ డయాక్సైడ్‌ నుంచి 180 కిలోల మిథనాల్‌ ఉత్పత్తి సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తోంది.

కోల్‌ ఇండియా, ప్రైవేట్‌ సంస్థలతో కలిసి చేసిన ప్రయోగం సఫలమైతే భారీ మిథనాల్‌ యూనిట్‌ స్థాపించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మంచిర్యాల జిల్లా పెగడపల్లిలో గల సింగరేణి థర్మల్‌ విద్యుత్కేంద్రం పక్కనే ఈ ప్లాంటును నిర్మిస్తోంది. 

థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో బొగ్గును మండించగా వెలువడే వాయువు నుంచి రోజుకు 500 కేజీల కార్బన్‌ డయాక్సైడ్‌ను సేకరించి, హైడ్రోజన్‌తో కలిపి చివరిగా మిథనాల్‌ ద్రవాన్ని పొందేలా ప్లాంటును ఏర్పాటుచేస్తోంది.