ఆప్టిమస్ ఇన్‌ఫ్రాకామ్ నోయిడాలో ఏర్పాటు చేసిన దేశంలోనే మొట్టమొదటి ట్యాంపర్డ్ గ్లాస్ ప్లాంటును 2025, ఆగస్టు 30న కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. మొబైల్ ఫోన్ల తెరలకు రక్షణ పొరగా (ప్రొటెక్టివ్ లేయర్) ఈ ట్యాంపర్డ్ గ్లాస్‌లను వాడతారు. వీటి తయారీ నిమిత్తం అమెరికాకు చెందిన కార్నింగ్ సంస్థతో ఆప్టిమస్ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.