దేశంలోనే తొలిసారి చట్టసభల మహిళా సాధికార కమిటీల జాతీయ సదస్సును 2025, సెప్టెంబరు 14న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తిరుపతిలో ప్రారంభించారు. తిరుపతి జిల్లా తిరుచానూరు సమీపంలోని రాహుల్ కన్వెన్షన్ సెంటర్‌లో రెండు రోజులపాటు ఇది జరుగుతుంది. గతంలో ఆయా రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల కమిటీలు సంబంధిత ప్రాంతాల్లోనే సమావేశమయ్యేవి. ఇందుకు భిన్నంగా లోక్‌సభ, రాజ్యసభ, అసెంబ్లీలకు సంబంధించిన వివిధ కమిటీల సమావేశాలను వేర్వేలు రాష్ట్రాల్లో నిర్వహించి అందరి అభిప్రాయాలను తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే అంచనాల కమిటీ జాతీయ సమావేశం ముంబయి (మహారాష్ట్ర)లో, ఎస్సీ, ఎస్టీల సంక్షేమ కమిటీల సదస్సు భువనేశ్వర్ (ఒడిశా)లో నిర్వహించారు.