Published on Aug 25, 2025
Current Affairs
దేశీయ సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు
దేశీయ సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు

గత ఆర్థిక సంవత్సరంలో (2024-25) దేశీయ సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు రూ.62,408.45 కోట్లుగా (7.45 బిలియన్‌ డాలర్లు) నమోదయ్యాయి.

2023-24లోని రూ.60,523.89 కోట్ల (7.38 బిలియన్‌ డాలర్లు)తో పోలిస్తే స్వల్పంగా పెరిగాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

పరిమాణం పరంగా చూస్తే.. 2023-24లో భారత్‌ నుంచి 17,81,602 టన్నుల సముద్ర ఉత్పత్తులు ఎగుమతి కాగా, 2024-25లో 16,98,170 టన్నులకు పరిమితమయ్యాయి.