2024 నవంబరులో దేశీయ విమాన మార్గాల్లో 1.43 కోట్ల మంది ప్రయాణించినట్లు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) వెల్లడించింది. 2023, నవంబరులో ప్రయాణించిన 1.27 కోట్ల మందితో పోలిస్తే ఈ సంఖ్య 12% అధికం.
* మొత్తం ప్రయాణికుల్లో 63.3% మందిని చేరవేయడం ద్వారా ఇండిగో అగ్ర స్థానంలో నిలిచింది. దీని తర్వాత స్థానాల్లో ఎయిరిండియా (24.4%), ఆకాశ ఎయిర్ (4.7%), స్పైస్‌జెట్ (3.1%), అలయన్స్ ఎయిర్ (0.7%) ఉన్నాయి.