Published on Dec 15, 2025
Current Affairs
దేశీయ బ్రెయిన్‌ స్టెంట్‌
దేశీయ బ్రెయిన్‌ స్టెంట్‌

పక్షవాత బాధితులకు చికిత్స విషయంలో దిల్లీలోని ఎయిమ్స్‌ దేశంలోనే తొలిసారిగా ఒక అధునాతన బ్రెయిన్‌ స్టెంట్‌ను రూపొందించింది. దీనిపై ప్రత్యేక క్లినికల్‌ పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసింది. ఈ సాధనానికి సూపర్‌నోవా స్టెంట్‌ అని పేరు పెట్టారు. గ్రావిటీ మెడికల్‌ టెక్నాలజీ సంస్థ ఈ సాధనాన్ని అభివృద్ధి చేసింది. దీనిపై గ్రాస్‌రూట్‌ పేరిట ప్రయోగాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 8 కేంద్రాల్లో వీటిని చేపట్టారు. దీనికి దిల్లీ ఎయిమ్స్‌ జాతీయ సమన్వయ కేంద్రంగా వ్యవహరించింది. ఈ సాధనాన్ని ప్రత్యేకంగా భారత్‌లోని భిన్న విభాగాల జనాభా అవసరాలకు అనుగుణంగా రూపొందించారు.