2024-25 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 820.93 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.70.60 లక్షల కోట్ల) విలువైన ఎగుమతులు చేసినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది.
2023-24 ఎగుమతులు 778.13 బి.డా.తో పోలిస్తే, ఇవి 5.5% ఎక్కువ. 2025, మార్చిలో ఎగుమతులు 0.7% పెరిగి 41.97 బి.డా.కు చేరాయి.
అయితే దిగుమతులు 11.3% పెరిగి, 63.51 బి.డా.కు చేరడం వల్ల వాణిజ్యలోటు 21.54 బి.డా.గా నమోదైంది.
2024-25లో వస్తువుల ఎగుమతులు 0.08% పెరిగి 437.42 బి.డా.కు, దిగుమతులు 6.62% అధికమై 720.24 బి.డా.కు చేరాయి.
ఫలితంగా వాణిజ్య లోటు 282.82 బి.డా.కు చేరింది. 2023-24లో వాణిజ్యలోటు 241.14 బి.డా.