దేశంలో అత్యధిక డిమాండ్ ఉన్న 80-150 సీట్ల విమానాలను భారత్‌లోనే తయారుచేసే వ్యవస్థ ఏర్పాటు కోసం అదానీ గ్రూప్, బ్రెజిల్‌కు చెందిన ఎంబ్రాయెర్ మధ్య అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఈ విషయాన్ని కేంద్ర పౌరవిమానయాన మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు 2026, జనవరి 27న వెల్లడించారు. దేశీయ అవసరాలకు తగ్గట్టు, స్థానికంగా విమానాలు తయారుచేసుకోవడానికి ఎంఓయూ వీలు కల్పిస్తుంది. దీని ప్రకారం అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, ఎంబ్రాయెర్ కలిసి దేశంలో విమాన తయారీ కేంద్రం ఏర్పాటుచేస్తాయి.
దేశీయంగా విమానాలను అసెంబ్లింగ్ చేయడమే కాదని, సాంకేతికతను కూడా ఎంబ్రాయెర్ బదిలీ చేస్తుందని పౌరవిమానయాన శాఖ తెలిపింది.