Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Dec 12, 2025
Government Jobs
దిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డులో పోస్టులు
దిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డులో పోస్టులు

దిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు (డీఎస్‌ఎస్‌ఎస్‌బీ) వివిధ విభాగాలలో మొత్తం కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులు ఎక్సైజ్‌, ఎంటర్‌టైన్‌మెంట్ & లగ్జరీ టాక్సెస్‌ డిపార్ట్‌మెంట్‌, లేబర్‌, డ్రగ్స్‌ కంట్రోల్‌, ఆర్బన్‌ డెవెలప్‌మెంట్‌, ఎన్‌సీసీ లాంటి విభాగాల్లో ఉన్నాయి. 

వివరాలు: 

మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌: 714 పోస్టులు

విభాగాలు: ఎక్సైజ్‌, ఎంటర్‌టైన్‌మెంట్ & లగ్జరీ టాక్సెస్‌ డిపార్ట్‌మెంట్‌, లేబర్‌, డ్రగ్స్‌ కంట్రోల్‌, ఆర్బన్‌ డెవెలప్‌మెంట్‌, ఎన్‌సీసీ, రిజిస్ట్రర్‌ కోఆపరేటివ్‌ సొసైటీస్‌, జనరల్‌ అడ్మినిస్ట్రేటివ్‌, ఆఫీస్‌ ఆఫ్‌ ది లోకాయుక్తా, డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌, సాహిత్య కళా పరిషత్‌, తదితరాలు.

అర్హత: మెట్రిక్యులేషన్‌/ 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 18- 27 సంవత్సరాలు (ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు; పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్లు వయసులో సడలింపు వర్తిస్తుంది.

జీతం: నెలకు రూ.18,000- రూ.56,900.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత (టైర్‌-1) పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.

పరీక్ష విధానం: జనరల్‌ అవేర్‌నెస్‌, రిజనింగ్‌ ఎబిలిటీ, న్యూమరికల్‌ ఎబిలిటీ, హిందీ, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ల నుంచి 200 అబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. 200 మార్కులు, నెగటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.100, ఎస్సీ/ఎస్టీ/మహిళలు, దివ్యాంగులు/ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 15.01.2026.

Website:https://dsssb.delhi.gov.in/