Published on Sep 23, 2024
Government Jobs
దిల్లీ సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో డ్రైవర్ ఖాళీలు
దిల్లీ సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో డ్రైవర్ ఖాళీలు

దిల్లీ ఎన్‌సీఆర్‌ పరిధిలోని సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్  (సీజీహెచ్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్‌) ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులను కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 35

వివ‌రాలు:

1. ఎంఆర్‌టీ (మాగ్నెటిక్ రెసొనెన్స్ టోమోగ్రఫీ): 03

2. పెర్ఫ్యూషనిస్ట్స్‌: 04

3. ఫుడ్ బేరర్: 09

4. డ్రైవర్: 19

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. డ్రైవర్ పోస్టులకు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.

వయోపరిమితి: 40 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు ఎంఆర్‌టీ పోస్టులకు రూ.20,903; పెర్ఫ్యూషనిస్ట్స్‌ పోస్టులకు రూ.25,000; ఫుడ్ బేరర్ పోస్టులకు రూ.18,993; డ్రైవర్ పోస్టులకు రూ.22,516.

దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ/ ఎక్స్ సర్వీస్‌మెన్/ మహిళా అభ్యర్థులకు రూ.590; ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.295.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్‌), బీఈసీఐఎల్‌ భవన్‌, సీ-56/ఏ-17, సెక్టార్-62, నోయిడా’ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తు చివరి తేదీ: 30-09-2024.

Website:https://www.becil.com/Vacancies