దిల్లీ 9వ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా 2025, ఫిబ్రవరి 20న రామ్‌లీలా మైదానంలో ప్రమాణం చేశారు.
అదే వేదికపై మంత్రులుగా మరో ఆరుగురితోనూ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనా ప్రమాణం చేయించారు.
మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో పర్వేశ్ వర్మ, కపిల్ మిశ్రా, మంజిందర్ సింగ్ సిర్సా, ఆశీశ్ సూద్, రవీందర్ ఇంద్రజ్ సింగ్, పంకజ్ సింగ్ ఉన్నారు.