ప్రముఖ బౌద్ధ ఆధ్యాత్మిక గురువు 14వ దలైలామా జీవితంపై హైదరాబాద్‌కు చెందిన పాత్రికేయుడు అరవింద్‌యాదవ్ హిందీలో ‘అనశ్వర్’ పేరుతో పుస్తకం రచించారు. దీన్ని కేంద్ర మాజీమంత్రి కరణ్ సింగ్ 2025, నవంబరు 16న ఆవిష్కరించారు. హిందీలో రాసిన ఈ జీవితకథను రచయిత తెలుగు, ఇంగ్లిష్ భాషల్లోకి అనువదిస్తున్నారు.