- ప్రముఖ బౌద్ధ గురువు దలైలామాకు గ్రామీ అవార్డు దక్కింది. ‘మెడిటేషన్స్: ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిస్ హోలీనెస్ ద దలైలామా’ పేరుతో ఆయన చేసిన ప్రసంగ ఆల్బమ్‌కు ఈ గౌరవం దక్కింది. 90 ఏళ్ల టిబెట్ ఆధ్యాత్మిక గురువు అయిన దలైలామాకు గోల్డెన్ గ్రామోఫోన్ దక్కడం ఇదే తొలిసారి. 2026, ఫిబ్రవరి 2న లాస్ ఏంజెలెస్‌లోని క్రిప్టోడాట్‌కామ్ ఎరీనాలో జరిగిన కార్యక్రమంలో మొత్తం 90 కేటగిరీలో అవార్డులను ప్రకటించారు.
- దలైలామా తరఫున గాయకుడు రఫూస్ వెయిన్‌రైట్ అవార్డును స్వీకరించారు.