అంతరిక్ష వాహకనౌకల్లో వినియోగించే ద్రవ (లిక్విడ్) ఇంజిన్‌ల రీస్టార్ట్ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసినట్లు ఇస్రో 2025, జనవరి 18న ప్రకటించింది.
తమిళనాడు మహేంద్రగిరిలోని ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో వికాస్ లిక్విడ్ ఇంజిన్ రీస్టార్ట్ ప్రక్రియను పరీక్షించినట్లు వెల్లడించింది.
ఈ ఇంజిన్‌ను తొలుత 60 సెకన్ల పాటు మండించి నిలిపివేశారు. 120 సెకన్ల తర్వాత మళ్లీ ప్రారంభించగా 7 సెకన్ల పాటు ఇంజిన్ మండినట్లు ఇస్రో పేర్కొంది. అన్ని దశల్లోనూ ఇంజిన్ పనితీరు మెరుగ్గా ఉందని తెలిపింది.