ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి 8 నెలల్లో (ఏప్రిల్-నవంబరు) ద్రవ్య లోటు వార్షిక లక్ష్యంలో 52.5 శాతానికి చేరిందని ప్రభుత్వం 2024, డిసెంబరు 31న ప్రకటించింది.
ప్రభుత్వ వ్యయాలు, ఆదాయానికి మధ్య వ్యత్యాసమే ద్రవ్య లోటు. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం ద్రవ్య లోటు రూ.8.47 లక్షల కోట్లకు చేరింది.
కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం ద్రవ్య లోటును 2024-25లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 4.9 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
విలువ పరంగా రూ.16,13,312 కోట్లకు పరిమితం చేయాలనుకుంటోంది. 2023-24లో ఇది జీడీపీలో 5.6 శాతంగా నమోదైంది.