Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Jan 31, 2026
Current Affairs
ద్రవ్యలోటు రూ.8.55 లక్షల కోట్లు
ద్రవ్యలోటు రూ.8.55 లక్షల కోట్లు
  • దేశ ద్రవ్యలోటు 2025 డిసెంబరు చివరకు రూ.8.55 లక్షల కోట్లుగా నమోదైంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు, జీడీపీలో 4.4% లేదా రూ.15.69 లక్షల కోట్లుగా ఉండొచ్చని కేంద్రం అంచనా వేసింది. ఈ అంచనాల్లో తాజా గణాంకాలు 54.5 శాతానికి సమానం. 2024-25 ఇదే సమయంలో ద్రవ్యలోటు బడ్జెట్‌ లక్ష్యంలో 56.7 శాతంగా ఉంది. ప్రభుత్వ ఆదాయ, వ్యయాల వ్యత్యాసాన్ని ద్రవ్యలోటుగా పరిగణిస్తారు. కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సీజీఏ) గణాంకాల ప్రకారం..
  • 2025 డిసెంబరు చివరకు ప్రభుత్వానికి రూ.25.25 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. బడ్జెట్‌ అంచనాల్లో ఈ మొత్తం 72.2 శాతానికి సమానం. ఇందులో రూ.19.39 లక్షల కోట్లు పన్నుల రూపేణ, రూ.5.39 లక్షల కోట్లు పన్నేతర ఆదాయంగా లభించింది. రుణ రహిత పెట్టుబడి సాధనాల్లో రూ.46,047 కోట్లు సమకూరాయి.