Published on Nov 4, 2024
Current Affairs
ద్రవ్యలోటు రూ.4,74,520 కోట్లు
ద్రవ్యలోటు రూ.4,74,520 కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి ఆరు నెలల్లో ద్రవ్యలోటు పూర్తి ఆర్థిక సంవత్సర లక్ష్యంలో 29.4 శాతానికి చేరిందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. కేంద్ర వ్యయాలు, ఆదాయాల మధ్య అంతరాన్ని ద్రవ్యలోటుగా పరిగణిస్తారు. రూపాయల్లో చెప్పాలంటే సెప్టెంబరు చివరకు ద్రవ్యలోటు రూ.4,74,520 కోట్లుగా నమోదైంది. 2023-24 తొలి ఆరు నెలల్లో ద్రవ్యలోటు, బడ్జెట్‌ అంచనాల్లో 39.3 శాతంగా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ద్రవ్యలోటును జీడీపీలో 4.9 శాతానికి (రూ.16,13,312 కోట్లకు) పరిమితం చేయాలని బడ్జెట్‌లో ప్రభుత్వం అంచనా వేసింది. 2023-24లో ద్రవ్యలోటు 5.6 శాతంగా ఉంది.