Published on Nov 6, 2025
Current Affairs
దుర్భర దారిద్య్రాన్ని జయించిన కేరళ
దుర్భర దారిద్య్రాన్ని జయించిన కేరళ

దుర్భర దారిద్య్రాన్ని (కడు పేదరికాన్ని) జయించిన తొలి రాష్ట్రంగా కేరళ చరిత్ర సృష్టించింది. కేరళ రాష్ట్రంలోని వామపక్ష కూటమి(ఎల్‌డీఎఫ్‌) ప్రభుత్వం 2021లో దుర్భర దారిద్య్ర నిర్మూలన కార్యక్రమాన్ని (ఈపీఈపీ) ప్రకటించింది. నవంబరు 1న, ఆ రాష్ట్ర 69వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాము ఆ లక్ష్యాన్ని 100శాతం సాధించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దుర్భర దారిద్య్రం నుంచి 64వేల కుటుంబాలకు విముక్తి కల్పించినట్లు తెలిపింది. కనీస అవసరాలైన ఆహారం, ఇల్లు, ఆరోగ్యం, ఉపాధి మార్గాలను వారందరికీ సమకూర్చినట్లు వెల్లడించింది. కొట్టాయం, కన్నూర్‌ జిల్లాలు...ఈపీఈపీ అమలులో అగ్రస్థానంలో నిలిచాయి.