పశ్చిమబెంగాల్‌లోని దార్జీలింగ్‌లో శీతాకాల పంట మాండరిన్ నారింజకు జీఐ ట్యాగ్ లభించింది. ఈ నారింజకు దేశంలోనే కాకుండా అంతర్జాతీయ పర్యాటకుల నుంచీ మంచి ఆదరణ ఉంది. దీని పేరు జీఐ రిజిస్ట్రీలో నవంబరు 24వ తేదీన నమోదైంది. రాష్ట్రంలో జీఐ ట్యాగ్ పొందిన 11వ పంటగా ఇది నిలిచింది.