దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబు ‘గౌరవ్’ను భారత్ విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వశాఖ 2025, ఏప్రిల్ 11న పేర్కొంది. వెయ్యి కిలోల తరగతికి చెందిన ఈ అస్త్రాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. తాజా పరీక్షల్లో భాగంగా ఈ బాంబును సుఖోయ్-30ఎంకేఐ యుద్ధవిమానం నుంచి శాస్త్రవేత్తలు జారవిడిచారు. నిర్దేశిత 100 కిలోమీటర్ల పరిధిని అది అత్యంత కచ్చితత్వంతో సాధించగలిగింది. ఈ ప్రయోగాలు విజయవంతం కావడంతో ఈ అస్త్రాన్ని భారత వైమానిక దళంలో చేర్చడానికి మార్గం సుగమమైంది.