Published on Nov 13, 2024
Current Affairs
దీర్ఘశ్రేణి క్రూజ్‌ క్షిపణి పరీక్ష
దీర్ఘశ్రేణి క్రూజ్‌ క్షిపణి పరీక్ష

భూతలంపై దాడులు చేయగల దీర్ఘశ్రేణి క్రూజ్‌ క్షిపణి (ఎల్‌ఆర్‌ఎల్‌ఏసీఎం)ని భారత్‌ 2024, నవంబరు 12న తొలిసారిగా పరీక్షించింది. ఒడిశా తీరానికి చేరువలోని ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి జరిగిన ఈ ప్రయోగం విజయవంతంగా సాగిందని రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది. 

ఎల్‌ఆర్‌ఎల్‌ఏసీఎంను బెంగళూరులోని ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ అభివృద్ధి చేసింది. డీఆర్‌డీవోకు చెందిన పలు ల్యాబ్‌లు, ప్రైవేటు పరిశ్రమలు దీని రూపకల్పనలో పాలుపంచుకున్నాయి.

క్షిపణి ఉత్పత్తి బాధ్యతను హైదరాబాద్‌లోని భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్, బెంగళూరులోని బీఈఎల్‌ సంస్థలు చేపట్టాయి.