హైదరాబాద్‌కి చెందిన దియా లోకా (17) ప్రఖ్యాత డయానా అవార్డుకు ఎంపికైంది.
దేేశవ్యాప్తంగా నగరాల్లో పెరుగుతున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్‌పై ప్రజల్లో కల్పిస్తున్న అవగాహనకు ఈ పురస్కారం దక్కినట్లు అవార్డు కమిటీ ప్రకటించింది.
ప్రస్తుతం దియా చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ప్లస్ 2 చదువుతోంది.
బ్రిటన్ యువరాణి డయానా జ్ఞాపకార్థం ‘దూరదృష్టి, సామాజిక ప్రభావం, ఇతరులకు స్ఫూర్తిగా నిలవడం, యువ నాయకత్వం, సేవ’ అనే 5 అంశాల్లో ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు.
సామాజిక సేవా విభాగంలో దియా ఎంపికైంది.