Published on Dec 13, 2024
Current Affairs
దొమ్మరాజు గుకేశ్‌
దొమ్మరాజు గుకేశ్‌

ప్రపంచ క్లాసిక్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో దొమ్మరాజు గుకేశ్‌ విజేతగా నిలిచాడు. 2024, డిసెంబరు 12న సంగపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో 14 రౌండ్లో డింగ్‌ లిరెన్‌ను (చైనా) ఓడించిన గుకేశ్, 7.5 పాయింట్లతో విజేతగా నిలిచాడు.

ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన గుకేశ్‌ వయసు 18 ఏళ్ల 8 నెలల 14 రోజులు. పిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కాస్పరోవ్‌ (1985లో 22 ఏళ్ల 6 నెలల 27 రోజులు) రికార్డును బద్దలు కొట్టాడు. 

ప్రపంచ క్లాసిక్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన రెండో భారతీయుడు గుకేశ్‌. 5 సార్లు టైటిల్‌ గెలిచిన ఆనంద్‌ అతనికంటే ముందున్నాడు. 

విజేతగా నిలిచిన దొమ్మరాజు గుకేశ్‌కు ట్రోఫీతో పాటు రూ.11.45 కోట్ల నగదు బహుమతి కూడా దక్కింది. రన్నరప్‌ లిరెన్‌ రూ.9.75 కోట్లు గెలుచుకున్నాడు.