Published on Jan 24, 2025
Current Affairs
దొమ్మరాజు గుకేశ్‌
దొమ్మరాజు గుకేశ్‌

చెస్‌ స్టార్‌ దొమ్మరాజు గుకేశ్‌ తాజా ఫిడే ర్యాంకింగ్స్‌లో 2784 రేటింగ్‌ పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు.

టాటా స్టీల్‌ చెస్‌ టోర్నీలో రెండో విజయాన్ని అందుకున్న గుకేశ్‌ రేటింగ్‌ను కూడా మెరుగుపరుచుకున్నాడు.

ఈ క్రమంలో భారత్‌ తరఫున మెరుగైన ర్యాంకులో ఉన్న అర్జున్‌ ఇరిగేశి (2779.5)ని అధిగమించాడు. 

నార్వే దిగ్గజ ఆటగాడు మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (2832.5) అగ్రస్థానంలో ఉన్నాడు. అమెరికా ప్లేయర్లు హికరు నకముర (2802), ఫాబియానో కరువానా (2798) తర్వాతి స్థానాలు సాధించారు.