Published on Dec 11, 2025
Current Affairs
దీపావళికి యునెస్కో గుర్తింపు
దీపావళికి యునెస్కో గుర్తింపు
  • యునెస్కో ఇన్‌టాంజిబుల్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ జాబితాలో దీపావళి పండగను చేర్చారు. దిల్లీలోని ఎర్రకోట వద్ద నిర్వహించిన సమావేశంలో యునెస్కో 2025, డిసెంబరు 10న ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో భారత్‌కు చెందిన 15 అంశాలు యునెస్కో వారసత్వ గుర్తింపు పొందినట్లయింది.
  • వీటిలో కుంభమేళా, కోల్‌కతా దుర్గా పూజ, గుజరాత్‌లోని గర్బా నృత్యం, యోగా, వేద పఠన సంప్రదాయం, రామాయణ గాథను ప్రదర్శించే రామ్‌లీల సంప్రదాయ ప్రదర్శనలున్నాయి. వీటిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని యునెస్కో ప్రతినిధులు వెల్లడించారు.