బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె ‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026’కు ఎంపికయ్యింది.
ఈ గౌరవాన్ని దక్కించుకున్న తొలి భారతీయ నటిగా రికార్డు సృష్టించింది.
మోషన్ పిక్చర్స్ విభాగంలో ఆమె ఈ ఘనతను సొంతం చేసుకుంది.
‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026’కు ఆమెతోపాటు.. హాలీవుడ్ తారలు డెమి మూర్, రాచెల్ మెక్‌ఆడమ్స్, ఎమిలీ బ్లంట్ లాంటి 35 మంది ప్రతిభావంతులను ఎంపిక చేసినట్లు ఛాంబర్ తెలిపింది.