Published on Oct 31, 2025
Government Jobs
దీన్‌దయాళ్ పోర్ట్ అథారిటీలో మేనేజర్ ఉద్యోగాలు
దీన్‌దయాళ్ పోర్ట్ అథారిటీలో మేనేజర్ ఉద్యోగాలు

గుజరాత్‌లోని దీన్‌దయాళ్ పోర్ట్ అథారిటీ (డీపీఏ) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య - 06

వివరాలు:

1. మేనేజర్ (హాస్పిటల్ మేనేజ్‌మెంట్) - 01

2. డాక్టర్స్ - 02

3. మేనేజర్ (లా) - 02

4. మేనేజర్ (సేఫ్టీ & ప్రాసెస్ సేఫ్టీ మేనేజ్‌మెంట్) -01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ, పీజీ,( లా, హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌, ఎంబీబీఎస్, మెకానికల్/కెమికల్/ఎలక్ట్రికల్/ఫైర్ సేఫ్టీ & ఇంజినీరింగ్‌)లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 28-11-2025.

Website:https://www.deendayalport.gov.in/en/recruitment/