భారత పురుషుల హాకీ జట్టు మాజీ గోల్‌కీపర్ మాన్యుయెల్ ఫ్రెడరిక్ (78) 2025, అక్టోబరు 31న బెంగళూరులో కన్నుమూశారు. 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత జట్టులో ఫ్రెడరిక్ సభ్యుడు. 2019లో కేంద్ర ప్రభుత్వం నుంచి మేజర్ ధ్యాన్‌చంద్ జీవితకాల సాఫల్య పురస్కారం అందుకున్నారు. 1947 అక్టోబరు 20న కన్నూర్‌లోని బర్నస్సేరిలో జన్మించిన ఫ్రెడరిక్.. కేరళకు మొదటి ఒలింపిక్ పతకాన్ని అందించాడు.