దక్షిణ రైల్వే చెన్నై వివిధ విభాగాల్లో యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 3518
వివరాలు:
1. అప్రెంటిస్- క్యారేజ్ & వ్యాగన్ వర్క్స్, పెరంబూర్: 1394
2. సెంట్రల్ వర్క్‌షాప్, గోల్డెన్ రాక్: 857
3. సిగ్నల్ అండ్ టెలికమ్ వర్క్‌షాప్ యూనిట్స్, పొడనూర్: 1267
విభాగాలు: ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, ఎంఎల్‌టీ, కార్పెంటర్, ఎంఎంవీ, ఎంఎంటీఎం, మెషినిస్ట్, టర్నర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, వైర్‌మెన్.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్, పదో తరగతి, ఐటీఐలో ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 2025 జనవరి 1వ తేదీ నాటికి 15 - 24 ఏళ్లు ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ. 6000 - రూ.7000.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 సెప్టెంబర్ 26.
Website:https://sronline.etrpindia.com/rrc_sr_apprenticev1/recruitmentIndex