దక్షిణ కొరియాలో ఒకవైపు అత్యల్ప జనన రేటు కొనసాగుతుండగా మరోవైపు ప్రతి ఐదుగురిలో ఒకరు 65 ఏళ్లు దాటినవారు ఉన్నారు.
ఆసియా ఖండంలో అతి వయోవృద్ధ సమాజాల జాబితాలోకి చేరిన రెండో దేశంగా దక్షిణ కొరియా నిలిచింది. మొదటి స్థానంలో జపాన్ ఉంది.
దక్షిణ కొరియా జనాభా 5.17 కోట్లు. ఇందులో 20 శాతం మంది 65 ఏళ్లు దాటినవారే. జనాభాలో 7 శాతం కంటే ఎక్కువ మంది 65 ఏళ్లు దాటిన వారు ఉన్న దేశాన్ని ఐక్యరాజ్య సమితి వయోవృద్ధ సమాజం (ఏజింగ్ సొసైటీ)గా గుర్తిస్తుంది.
ఈ వయోవర్గానికి చెందిన వారు జనాభాలో 14 శాతాన్ని మించితే అలాంటి దేశాలను పండుముసలి సమాజం (సూపర్ ఏజ్డ్ సొసైటీ)గా గుర్తిస్తారు.